calender_icon.png 17 November, 2024 | 2:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

20-07-2024 10:56:02 AM

హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వానలు కురుస్తాయని వాతావారణశాఖ పేర్కొంది. భారీ వర్షాలతో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరింది. గోదావరి, కృష్ణ నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. దీంతో చూట్టుపక్కల ఉండే ప్రజలకు అధికారులు అప్రమత్తం చేశారు.

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రస్తుతం పూరీ తీరానికి వాయవ్యంగా 40 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గోపాల్ పూర్ కు ఈశాన్యంగా 70 కిలో మీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైనట్లు సమాచారం. ఒడిశా నుంచి చిలక సరస్సు దగ్గరగా వాయుగుండం గంటకు 3 కిలీ మీటర్ల వేగంతో కదులుతోంది. వాయవ్యంగా ఒడిశా-ఛత్తీస్ గఢ్ మధ్య తీరం దాటే అవకాశం. 24 గంటల్లో ఒడిశా- ఛత్తీస్ గఢ్ సమీపంలో వాయుగుండం తీరం దాటనుంది. దీంతో ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తీరప్రాంతాల్లోని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ లో సాయంత్రం వరకు వర్షం కురిసే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన. నేడు మంచిర్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.