calender_icon.png 31 October, 2024 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

06-07-2024 09:22:13 PM

హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడా వర్షం పడింది. దీంతో నగరం తడిసిముద్దయింది. కొత్తపేట, మలక్ పేట, దిల్ సుఖ్ నగర్, చైతన్యపురి, గచ్చిబౌలి, మాదాపూర్, చందానగర్, మియాపూర్,  బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఎస్సార్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, అమీర్ పేట్, భరత్ నగర్, సనత్ నగర్, మారేడ్ పల్లి, బోయిన్ పల్లి,కుత్బుల్లాపూర్, అడ్డగుట్ట,  బన్సీలాల్ పేట, బేగంపేట, రాణీగంజ్, సికింద్రాబాద ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి.

దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ, విపత్తు నిర్వహణ బృందం ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్చలు చేపడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిస్తున్నాయి. రేపు ఎల్లుండి కూడా వానాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. వికారాబాద్,సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వనపర్తి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది.