ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ కేంద్రం
హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో నాలుగు రో జులపాటు కొన్ని జిల్లాల్లో భారీ నుం చి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు వర్ష సూచన ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లా లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించిం ది. నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమ కొండ, హైదరాబాద్, మేడ్చల్ మ ల్కాజిగిరి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.