-తాండూర్ నుంచి మహబూబ్ నగర్ నాలుగు చోట్ల రోడ్డు తెగిన వైనం రాకపోకలు బంద్..
-తాత్కాలిక రోడ్డు ఏర్పాటుకు రెండు, మూడు రోజులు సమయం పట్టి అవకాశం
-చెరువులు కుంటలు నిండి అలుగులు పారుతున్నాయి.
-వేపూర్ వాగులో ఉన్న కూలిన 33 కెవి విద్యుత్ స్తంభం
-రాత్రి నుంచి 20 గ్రామాలకు విద్యుత్ సరఫరా బంద్
-వాగులు కుంటలు పొంగిపొల్లడంతో పలుచోట్ల కొట్టుకుపోయిన వరి పంట
-అత్యవసరమైతే తప్ప...కాలు బయట పెట్టని జనం
మహబూబ్ నగర్, (విజయక్రాంతి) : ఈ ఏడాది వర్షాలు కురుస్తాయో లేదో అని సందేహంతో చాలామంది రైతులు వరి పంట సాగు చేసేందుకు సంకోచించారు. గత నాలుగైదు రోజుల క్రితం వరకు జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా వర్షపాతం నమోదు కాలేదు దీంతో పంటల సైతం కొంతమేరకు మాత్రమే సాగు చేయడం జరిగింది. వరుసగా గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షం జిల్లాను అతల కుతలం చేసింది. ఏకధాటిగా అధికంగా వర్షం కురవడంతో చెరువులు, కుంటలు నిండి పొంగిపొర్లుతున్నాయి. దీంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప కూడా బయటికి కాలు మోపెందుకు జంకుతున్నారు.
నాలుగు చోట్ల తాత్కాలిక బ్రిడ్జిలు గండి..
మహబూబ్ నగర్ నుంచి పరిగి, వికారాబాద్, తాండూర్ వెళ్లే ప్రధాన రోడ్డు మార్గం లో నిర్మిస్తున్న బ్రిడ్జిల దగ్గర తాత్కాలిక బ్రిడ్జి రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. హన్వాడ మండలం సమీపంలోని బ్రిడ్జి, మహమ్మదాబాద్ ఇబ్రహీంబాద్ సమీపంలోని ఉన్న మూడు బ్రిడ్జిలు వర్షం దాటికి కొట్టుకుపోయాయి. బస్సులు లారీలు ద్విచక్ర వాహనాలు ఆటోలు ఏ వాహనం కూడా ఇటు నుంచి అటు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈ బ్రిడ్జిలు తాత్కాలికంగా ఏర్పాటు చేసేందుకు రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉంది.
ఈ బ్రిడ్జిల నిర్మాణం కూడా పనులు చేద్దాంలే ?చూద్దాంలే ? అన్నట్లు నడుస్తున్నాయని ఆయా గ్రామాల ప్రజలు, వాహన చోదకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహమ్మదాబాద్ సమీపంలోని రామాలయం దగ్గర ఉన్న తాత్కాలిక బ్రిడ్జి కొట్టుకుపోయినప్పటికీ ఎస్సై శేఖర్ రెడ్డి జెసిబి సాయంతో నీరు మరింత వేగంగా పోయేలా అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఒక్కసారిగా ప్రధాన రోడ్డుపై నాలుగు తాత్కాలిక విడుదల కొట్టుకపోవడంతో ప్రజలు ఆయా గ్రామాలకు రాకపోలు పూర్తి నిలిచిపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వేపూరు వాగు మధ్యలో ని వంగిన 33 కెవి విద్యుత్ స్తంభం...
హన్వాడ, కోయిలకొండ మండల పరిధిలోని గ్రామాలకు విద్యుత్తు ఉదయం 4 గంటల నుంచి నిలిచిపోయింది. వేపూరు వాగులో 33 కెవి విద్యుత్ స్తంభం ఉండడంతో వరదదాటికి ఆ స్తంభం ఒరిగిపోయింది. దీంతో విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేయడం జరిగింది. ఈ కారణంగా దాదాపు 20 గ్రాములకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జడ్చర్ల దేవరకద్ర నియోజకవర్గంలలో చెరువులు కుంటలు ఇంటి వాగులు పాడుతున్నాయి.