కొట్టుకపోయిన బ్రిడ్జి నీళ్లు చేపైనా రాక పోకలు
ఉదృతంగా పొంగి ప్రవహిస్తున్న వాగులు
జల మాయమైన ఇండ్లు
భద్రాద్రి కొత్తగూడెం, విజయక్రాంతి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం ఉదయం నుంచి కురుస్తున్న ఏకదాటి వర్షాల కారణంగా కొత్తగూడెం నియోజకవర్గం అంతా అతలకుతలంగా మారింది. పాల్వంచ మండల పరిధిలోని ఉలవ నూరు పంచాయతీ లోగల మంది బ్రిడ్జి కొట్టుకుపోవడంతో పాల్వంచకు ఉలువనూరుకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఉలవనూరు గ్రామంలో సుమారు 50 గృహాలు నీటమునిగాయి. మండల పరిధిలోని పాండురంగపురం, నాగారం ,శ్రీనివాస్ కాలనీ ప్రాంతాల్లో ఉన్న కిన్నెరసాని ముర్రేడు వాగులు ఉదృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి. పాల్వంచ పట్టణ పరిధిలోని బొడ్డుగూడెం శ్రీనివాస్ కాలనీ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరద ఉధృతి ప్రాంతాల్లో అధికార బృందాలు పర్యటించే పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి.