calender_icon.png 31 October, 2024 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు 5 జిల్లాల్లో భారీ వర్షాలు

15-07-2024 11:03:40 AM

హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం 5 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నేడు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నమోదైన వర్షపాతం వివరాలు. అత్యధికంగా మంచిర్యాల జిల్లా నీల్వాయిలో 15.83 సెం.మీ వర్షపాతం, భూపాలపల్లి జిల్లా కాటారంలో 11.15 సెం.మీ వర్షపాతం, ఆసిఫాబాద్ జిల్లా కుంచవెల్లిలో 11.08 సెం.మీ వర్షపాతం, భూపాలపల్లి జిల్లా మహాదేవ్ పూర్ లో 11 సెం.మీ వర్షపాతం, భూపాలపల్లి జిల్లా కొయ్యూరులో 10.65 సెం.మీ వర్షపాతం, మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 9.48 సెం.మీ వర్షపాతం, హైదరాబాద్ యూసఫ్ గూడలో 9.48 సెం.మీ వర్షపాతం, వికారాబాద్ జిల్లా నవాబ్ పేటలో 8.48 సెం.మీ వర్షపాతం, హైదరాబాద్ షేక్ పేటలో 8.45 సెం.మీ మారేడ్ పల్లిలో 8.4 సెం.మీ, ఖైరతాబాద్ లో 8.4 సె.మీ, ముషీరాబాద్ లో 8.2 సెం.మీ వర్షపాతం, హైదరాబాద్ శేరిలింగంపల్లిలో 7.93 సెం.మీ వర్షపాతం, హనుమకొండ దామెరలో 7.5 సెం.మీ వర్షపాతం, సంగారెడ్డి జిల్లా మొగ్డంపల్లిలో 7.43 సెం.మీవర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ లో రాత్రి ఎడతెరిపి లేని వర్షానికి రోడ్డు జలమయం అయ్యాయి. మైత్రివనం హెచ్ఎండీఏ కార్యాలయం వద్ద భారీగా వరద నీరు చేరింది. వరద నీరు చేరడంతో హెచ్ఎండీఏ కార్యాలయ పరిసరాలు బురదమయం అయ్యాయి. యూసఫ్ గూడ శ్రీకృష్ణనగర్ లో రహదారిపై మోకాళ్లు లోతు వరద నీరు చేరింది. వాటర్ ట్యాంకు, సామగ్రి వరద నీటిలో కొట్టుకుపోయాయి.