calender_icon.png 15 October, 2024 | 5:56 AM

ఏపీలో భారీ వర్షాలు

15-10-2024 01:28:09 AM

మరో మూడు రోజులు వానలే

ఐదు జిల్లాల్లో తీవ్ర ప్రభావం

కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు

విద్యుత్ సరఫరాకు  తీవ్ర అంతరాయం

హైదరాబాద్, అక్టోబర్ 14:  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు. ప్రకాశం, అన్నమయ్య, గుంటూరు, విశాఖ జిల్లాల్లో  సోమవారం నుంచే భారీ వర్షం పడుతోంది. ఎడతెరపి లేని వాన కారణంగా కొన్ని చోట్ల కరెంట్ సరఫరా నిలిచిపోయిం ది.

భారీ వర్షాలు పడుతుండడంతో ముందు జాగ్రత చర్యగా నెల్లూరు. ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. వర్షాల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. అత్యవసరమైతే 0861 23311261, 7995576699,1097 నంబర్ల కు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు.

జిల్లాలోని సముద్రతీర ప్రాంతల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు  తరలించామ ని ఆయన తెలిపారు. మత్స్యకారులు ఎవ రూ కూడా సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలో కురుస్తున్న వర్షానికి ఒంగోలు టౌన్‌లోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నం, ఉయ్యూరు.

అవనిగడ్డలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. కాగా రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు  మంగళవారం నుంచి గురువారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షా లు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దీంతో  ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తమయ్యారు.  ఎటువంటి ఆస్తి, ప్రాణ, పశు నష్టం  జరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. 

తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు 

గురువారం వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో భక్తుల భద్రత దృష్ట్యా ముందస్తుగా 16న వీఐపీ బ్రేక్ దర్శానలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈమేరకు టీటీడీ ఈవో శ్యామలరావు వర్చువల్ విధానంలో అధికారులతో నిర్వహించిన స మావేశంలో  నిర్ణయం తీసుకున్నారు.

అలాగే 15న సిఫార్సు లేఖలను అనుమతించకూడదని నిర్ణయించారు. తి రుమలలో కురుస్తున్న భారీ వర్షం కా రణంగా భక్తులకు దర్శనం, వసతి సౌకర్యాలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  ఘాట్ రోడ్డులో కొండచెరియలు విరి గిపడే అవకాశం ఉండడంతో భద్రతా చర్యలు తీసుకోవాలని  సూచించారు.