calender_icon.png 25 October, 2024 | 8:00 AM

ఏపీలో జోరుగా వానలు

22-07-2024 02:06:16 AM

పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి):  అల్పపీడన ప్రభావంతో  గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లోని ప లు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నా యి. వీటి ప్రభావంతో కృష్ణా, గోదావరి నదుల్లో నీటి మట్టాలు పెరుగుతుండడంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు తరలిస్తు న్నారు. చెరువులు, వాగులు పొంగి పొ ర్లుతుండటంతో వాటికి గండ్లు పడి రో డ్లు కోతకు గురవుతున్నాయి. ధవళేశ్వ రం వద్డ గోదారి నీటిమట్టం 10.2 అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం నుంచి డెల్టా కాలువకు 1800 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. దేవీపట్నం మండలం గండిపో చమ్మ అమ్మవారి ఆలయం వద్ద  గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అమ్మవారి ఆలయం పూర్తిగా నీట ము నిగిపోయింది. అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.