calender_icon.png 15 January, 2025 | 1:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు రోజులు భారీ వర్షాలు

08-08-2024 12:32:48 AM

వాతావరణ కేంద్రం

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. దాదాపు 21 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫా బాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబా బాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడుతాయని చెప్పింది. ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ క్రమంలో ఈ రెండు రోజులపాటు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది.