calender_icon.png 19 April, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విస్తారంగా వానలు

16-04-2025 01:42:38 AM

భారత వాతావరణ శాఖ తీపికబురు

  1. తెలుగు రాష్ట్రాల్లో సాధారణం కంటే అధికమే
  2. ఈసారి 105 శాతం వర్షపాతం నమోదు!
  3. ఎల్‌నినో ప్రభావం ఈ ఏడాది ఉండదు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15 : దేశంలో ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తాయని మంగళవారం భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తీపికబురు చెప్పింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసే నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోద వుతుందని అంచనా వేసింది.

దీర్ఘకాలిక సగటు 87 సెంటీమీటర్లు ఉండగా.. ఈసారి 105 శాతం వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అధికారి మృత్యుం జయ్ మెహపాత్ర వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని చెప్పారు. 

ఐఎండీ అధికారుల అంచనా ప్రకా రం.. కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాలు అనుకూలమైన వర్షపాతం నుంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. నాలుగు నెలల రుతుపవనాల కాలంలో లడఖ్, ఈశాన్య తమిళ నాడులో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండనుంది.

మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకలోనూ సాధారణం కంటే ఎక్కువగానే ఉంటాయని చెప్పింది. దీని ప్రకారం పశ్చిమ, దక్షిణ భారతదేశంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధారణం కంటే అధిక వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తాగు, సాగునీటికి ఢోకా ఉండకపోవచ్చు.

2024-25 సీజన్‌లో సాధారణ వర్షపాతం నమోదుకావడంతో ప్రస్తుత రబీ సీజన్‌లో ఫిబ్రవ రిలోనే తీవ్ర నీటిఎద్దడి నెలకొంది. సాగునీరు లేక పలుచోట్ల పంటలు నెర్రె లు బాశా యి. భూగర్భజలాలు అడుగంటి తాగునీటికి కటకట ఏర్పడింది. రాబో యే నైరుతి సీజన్ ఆశాజనకంగా ఉండటంతో తెలు గు రాష్ట్రాలకు పెద్ద ఊరటే అని చెప్పవచ్చు.

ఎల్‌నినో ప్రభావం ఉండదు..

దేశంలో 1971-2020 మధ్యకాలంలో దీర్ఘకాల సగటు 87 సెంటీమీటర్లుగా ఉంద ని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. 96శాతం నుంచి 104శాతం మధ్య సాధారణ వర్షపాతం నమోదవుతోందన్నారు. ఈ పరిధి కంటే ఎక్కువగా కురిస్తే సాధారణం కంటే అధికమని పరిగణిస్తున్నారు. భారత ఉపఖండంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతానికి కారణమయ్యే ఎల్‌నినో పరిస్థితులు ఈ ఏడాది ఉండవని అధికారులు చెపుతున్నారు.

దీంతో రుతుపవనాలకు అనుకూలంగా మారి మంచి వర్షాలు కురుస్తాయంటున్నారు. ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ కూడా రాబోయే నైరుతి సీజన్‌లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. నైరు తి సీజన్ నెమ్మదిగా ప్రారంభమైనా మధ్య లో వర్షాలు వేగం పుంజుకోనున్నాయని, జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో సగటున 868.6 మి.మీ వర్షం కురుస్తుందని అంచనా వేసింది. 

వ్యవసాయానికి ఊతం ..

దేశ వ్యవసాయరంగానికి నైరుతి రుతుపవనాలే కీలకం. దేశజనాభాలో 42.3 శాతం మందికి ఉపాధి, దేశ ఆర్థిక వ్యవస్థకు 18.2శాతం వాటాను వ్యవసాయ రంగం అందిస్తోంది. మంచి వర్షాల ప్రభావంతో వ్యవసాయ రంగం మరింత వృద్ధిని నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.