- - తీవ్ర ఇబ్బందులకు గురైన వాహనదారులు...
- వెయ్యి మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు.
నాగర్ కర్నూల్, విజయక్రాంతి: నాగర్ కర్నూలు జిల్లాలో భారీగా వర్షపాతం నమోదయింది. జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల వారిగా 50 మిల్లీమీటర్ల వర్షపాతం కంటే అధికంగా నమోదయ్యి జిల్లా వ్యాప్తంగా 1,046.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. చెరువులు, కుంటలు, నాళాలు కబ్జాకోరులు కజ్జా చేయడంతో వర్షపు నీరంతా రోడ్లపైనే పారుతూ ప్రయాణికులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.
నాగర్ కర్నూల్ జిల్లా హౌసింగ్ బోర్డ్ ప్రాంతంలోని కొన్ని కుంటలు కబ్జాకు గురి కావడంతో అందులోని నీరంతా సామాన్యుల ఇళ్లల్లోకి, రోడ్లపైనే పారడంతో సామాన్యులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరి కొన్ని ప్రాంతాల్లో నాళాలన్నీ కబ్జా చేసి వ్యాపార సముదాయాలు నిర్మించడంతో చిన్నపాటి వర్షానికి మోకాళ్ళ లోతు నీళ్లు ప్రధాన రోడ్లపైనే పారుతూ వాహనాలు ఆగిపోతున్నాయి. మున్సిపల్, ఆయా గ్రామపంచాయతీ అధికారులు నాలా ఆక్రమణలను తొలగించక పోవడంతోనే ఈ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ ప్రాంతాల్లోనూ అధిక వర్షపాతం నమోదయింది.