26-04-2025 12:00:00 AM
తడిసిన ధాన్యంతో అన్నదాత అయోమయం
వెల్దుర్తి, ఏప్రిల్ 25 : వెల్దుర్తి మండలంలో శుక్రవారం సాయంత్రం కురిసిన ఈదురుగాలతో కూడిన భారీ వర్షానికి మండలం లోని అన్ని గ్రామాలలో రైతులు ఇబ్బంది పడ్డారు. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడడంతో ఎండబెట్టిన వరి ధాన్యం, కోతకు వచ్చిన వరి పంటకు భారీ నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశా రు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు ఎండబెట్టి తీసుకొచ్చిన పంట తడిసిపోవడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. ఆరు గాలం చేసిన కష్టమంతా తడిసి రోడ్డుపైన పారుతుంటే అన్నదాత ఆక్రందన అంతా ఇంతా కాదు. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.