calender_icon.png 15 November, 2024 | 7:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు, ఎల్లుండి భారీ వర్షాలు

09-09-2024 01:49:37 AM

  1. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ 
  2. ఆ తర్వాత మూడు రోజులు  ఓ మోస్తరు వానలు

హైదరాబాద్, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): బంగాళఖాతంలో 13 కిలోమీటర్ల గతి వేగంతో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడినట్లు ఐఎండీ హైదరాబాద్ చీఫ్ నాగరత్న చెప్పారు. ఈ వాయుగుండం రానున్న 24 గంటల్లో ఒడిశా, పశ్చిమబెంగాల్ వైపు వెళ్లనున్నట్లు తెలిపారు. పూరి, దిగ మధ్య తీరం దాటనున్నట్లు వెల్లడించారు. అల్పపీడనం ప్రభావంతో  సోమవారం, మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని నాగరత్న పేర్కొన్నారు. 11,12, 13 తేదీల్లో మోస్తరు వానలు పడుతాయని వెల్లడించారు. సోమవారం, మంగళవారం కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ, మిగతా మూడు రోజల పాటు ఎల్లో హెచ్చరికలను చేసింది.