రాష్ట్రంపై రుతుపవనాల ప్రభావం
హైదరాబాద్,జులై 7 (విజయక్రాంతి): తెలంగాణలో రుతు పవనాలు చురుగ్గా ఉన్నాయని, ఆ ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఈదురు గాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆదివారం భారత వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్నిచోట్ల మాత్రమే తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. సోమవారం ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి తదితర జిల్లాల్లో వర్ష తీవ్రత ఎక్కువ ఉంటుందని, మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజా మాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ల్లో వర్షతీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నది. హైదరబాద్‌కు ఎల్లో అలర్ట్‌ను వాతా వరణ శాఖ జారీ చేసింది.