హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురుస్తోంది. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కూకట్ పల్లి, మూసాపేట్, హైదర్ నగర్, కేపీహెచ్ బీ కాలనీ, బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతినగర్, గచ్చిబౌలి, మాదాపూర్, చందానగర్, మియాపూర్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఎస్సార్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, అమీర్ పేట్, భరత్ నగర్, సనత్ నగర్, మారేడ్ పల్లి, బోయిన్ పల్లి,కుత్బుల్లాపూర్, అడ్డగుట్ట, బన్సీలాల్ పేట, బేగంపేట, రాణీగంజ్, సికింద్రాబాద్, చర్లపల్లి, కీసర, నిజాంపేట్ నేరేడ్ మెట్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది.
అకస్మాత్తుగా కురిసిన వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు ఈదరుగాలులతో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది.