calender_icon.png 25 March, 2025 | 9:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జహీరాబాద్ లో భారీ వర్షం

22-03-2025 08:09:28 PM

జహీరాబాద్: జహీరాబాద్ నియోజకవర్గంలో రెండు రోజులుగా భారీ వర్షం కురిసింది. శుక్రవారం నాడు భారీ ఉరుములతో మెరుపులతో వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. రాత్రి వేళలో కరెంటు లేకపోవడంతో ప్రజలు అనేక అవస్థలు పడవలసి వచ్చింది. శనివారం నాడు సాయంత్రం భారీ ఉరుములతో మెరుపులతో ఈదురుగాలితో వడగళ్లతో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి కరెంటు అంతరాయం ఏర్పడింది. లేత లేత మామిడి పిందెలు నేలరాలాయి. దేదో మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షంతో గత నెల రోజుల నుండి మధ్యాహ్నం పూట భానుడి ప్రతాపానికి చల్లబడింది. పలుచోట్ల కరెంటు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం రాత్రి అంతా కరెంటు లేకపోవడంతో ప్రజలు చీకట్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయవలసి వచ్చింది. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు చొరవ తీసుకొని విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.