calender_icon.png 4 April, 2025 | 6:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో భారీ వర్షం రోడ్లన్నీ జలమయం!

04-04-2025 01:01:27 AM

  1. ఇబ్బందులు పడిన ప్రజలు
  2. ముషీరాబాద్‌లోబాపూజీ నగర్ ప్రేయర్ పవర్ చర్చి వీధిలో మోకాళ్లలోతు ప్రవహించిన వరద నీరు
  3. చెరువును తలపించిన ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం

మలక్‌పేట్/ముషీరాబాద్/వారసిగూడ, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): నగరంలో గంట పాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. మలక్పేట్ నల్గొండ చౌరస్తా, చాదర్ఘాట్ రైల్వే అండర్ బ్రిడ్జి, ముసారంబాగ్ బ్రిడ్జ్ వరద నీటితో పూర్తిగా జలమయం అయ్యాయి. రోడ్లు పూర్తిగా వర్ధనీటితో నిండిపోవడంతో వాహనాల రాకపో కలకు తీవ్ర విగాథం కలిగాయి. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై నిలిచిన వర్షం నీటిని తొలగించేందుకు మీరు ఇబ్బందులు పడ్డారు.

ముషీరాబాద్‌లో

గురువారం ఆకస్మికంగా కురిసిన భారీ వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ముషీరాబాద్ డివిజన్లోని బాపూజీనగర్, ప్రేయర్ పవర్ చర్చివీధి, బాప్టిస్ట్ చర్చి వీధి, పార్శిగుట్ట చౌరస్తా, రాజాడీలక్స్ చౌరస్తా వద్ద వరద నీరు రోడ్లపై మోకాళ్లలోతు ప్రవహించడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

బాపూజీనగర్, ప్రేయర్ పవర్ చర్చి వీధిలో ఇండ్లలోకి సైతం వర్షం నీరు వచ్చాయి. భోలక్పూర్ రంగానగర్ లోని మల్లేష్ నివాసం ఉంటున్న మూడవ అంతస్తులో భారీ వర్షానికి పై కప్పు పెచ్చులు ఊడి కింద పడ్డాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని భోలక్పూర్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, రంగానగర్ బస్తీ అధ్యక్షుడు వై.శ్రీనివాస్ రావు ఎమ్మెల్యే ముఠాగోఎల్ దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

బాపూజీనగర్‌లో పురాతన భవనం గోడలు, స్లాబ్ కూలిపోవడంతో బీజేపీ ముషీరాబాద్ నియోజకవర్గం జాయింట్ కన్వీనర్ ఎం. నవీన్ గౌడ్, బీజేవైఎం నగర కార్యదర్శి అనిల్ కుమార్, డివిజన్ అధ్యక్షుడు కంచి ముదిరాజ్ లు ఘటన స్థలానికి చేరుకోని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ముషీరాబాద్ ప్రభుత్వపాఠశాల ప్రాంగణంలో భారీ వర్షం నీరు నిలిచిపోవడంతో చెరువును తలపిస్తున్నది.

వారసిగూడలో

నగరంలో గురువారం కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఆర్ట్స్ కాలేజీ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి వద్ద ఈ వరద ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ప్రయాణించే వాహనదారులకు ఈ భారీ వర్షం ఎంతో ఇబ్బందికి గురిచేసింది. ఈ బ్రిడ్జి కింద నుంచి వరద ప్రవాహం నిండి గంటల తరబడి ఇటుగా ప్రయాణించే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. వానాకాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ దారిలో నిత్యం వేలాది మంది వాహనదారులు ప్రయాణిస్తారు. రాబోయే వానాకాలానికి ఈ సమస్యను పరిష్కరించాలని వారసిగూడ ప్రజలు కోరుతున్నారు.