calender_icon.png 31 October, 2024 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో భారీ వర్షం

01-07-2024 01:26:25 AM

 పలుచోట్ల రోడ్లపై నిలిచిన నీరు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 30 (విజయక్రాంతి): నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రోడ్లపై పలుచోట్ల నీళ్లు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. జూబ్లీహిల్స్, మైత్రీవనం, అమీర్‌పేట, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్, దోమల గూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్, ప్రగతినగర్, యూసుఫ్‌గూడ, బోరబండ, తిరుమలగిరి తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎక్కువ నీళ్లు నిలిచిన చోట జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. 

బయటకు రావొద్దు: మేయర్

సోమవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున నగర వాసులు ఇళ్లలోనే ఉండాలని, అనవసరంగా బయటకు రావొద్దని మేయర్ గద్వాల విజయలక్ష్మి తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా తెలిపారు. వర్షం కారణంగా సమస్యలు ఎదురైతే జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్  కంట్రోల్‌రూం నంబర్లు 040 9000113667కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు.