calender_icon.png 22 September, 2024 | 11:10 PM

నగరంలో కుండపోత వర్షం

22-09-2024 02:21:41 AM

రహదారులన్నీ జలమయం 

నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు 

పలుచోట్ల ట్రాఫిక్ జామ్

హైదరాబాద్/సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో రెండ్రోజులుగా రాత్రివేళల్లో వర్షం దంచికొడుతుంది. ఒకేసారి కుండపోతగా మొదలై గంటల తరబడి కురుస్తున్న వర్షానికి నగర ప్రజలు అస్తవ్యస్తంమవుతున్నారు.  ఏకధాటిగా కురిసే వర్షానికి రోడ్లపై నీరు నిలుస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటి ప్రవా హంతో రోడ్డుపై ఎక్క డ ఏ గుంత ఉందోనని వాహనదారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేయాల్సి వచ్చింది.

ఖైరతాబాద్, ఇందిరాపార్క్, ఎన్టీఆర్ స్టేడియం, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, వీఎస్టీ తదితర ప్రాంతాల రహదారుల వద్ద వాహనాలతో పాటు సాధారణ ప్రజలు రోడ్డు దాటాలంటే గగనమవుతోంది. గ్రేటర్‌లోని 141 వాటర్ లాగిన్ ప్రాంతాలను జీహెచ్‌ఎంసీ బృందా లు ఎప్పటికప్పుడు రోడ్లపై ఉండే నాలాలోకి వరద నీటిని మళ్లించేందుకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భం గా హైటెక్ సిటీ నుంచి సికింద్రాబాద్ రూట్‌లోని పంజాగుట్ట, బేగంపేట, కూకట్‌పల్లి నుంచి లక్డీకపూల్ రూట్‌లోని అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాకపూల్ ప్రాంతాల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

బేగంపేటలోని వరద నీరు నిలిచే ప్రాంతం లో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పర్యటించి ట్రాఫిక్ జామ్ పరిస్థితులను పరిశీలించి, చర్యలు చేపట్టారు. హుస్సేన్‌సాగర్ పరిసరాల్లోని స్ట్రాం వాటర్ డ్రైయిన్‌లో వరదనీరు సక్రమంగా వెళ్లక రివర్స్ ఫ్లో అయ్యింది. దీంతో రోడ్లపై నీరు నిలుస్తున్నట్టు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. గ్రేటర్‌లో శనివారం రాత్రి మాదాపూర్, హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, అమీర్ పేట, బషీర్‌బాగ్, అబిడ్స్, కోఠి, నారాయణ్‌గూడ, చిక్కడపల్లి, ముషీరాబాద్, సికింద్రాబాద్, తార్నాక, నాచారం, ఉప్పల్, రామాంతాపూర్, ఎల్‌బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, ముషీ రాబాద్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. కాగా, జిల్లాలో అత్యధికంగా భువనగిరిలో 1౦.౩ సెంటీమీటర్ల వర్షపాతం, నగరంలో అధికంగా గోల్కొండ ప్రాంతంలో 9.10 సెం.మీగా నమోదైంది.

మరో ఐదు రోజులు భారీ వర్షాలు

నైరుతీ బంగాళాఖాతంలో  కేంద్రీకృతమైన ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో మరో ఐదురోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వర్ష సూచన ఉన్న  జిల్లాలకు శనివారం ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఆవర్తనం ప్రభావం వల్ల ఈ నెల 23వ తేదీన పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. 

పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఆదిలాబాద్/నాగర్‌కర్నూల్/సూర్యాపేట: నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బోడ రాముడు(46) అనే రైతు శనివారం తన పొలంలో పశువులను మేపుతుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పిడుగుపడి తన వద్ద ఉన్న సెల్‌ఫోన్ పేలడంతో అక్కడికక్కడే మృతిచెం దాడు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సిర్సన్న గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తున్న కూలీ రాథోడ్ అవినాష్(18)పై పిడుగు పడి మృతి చెందాడు. సూర్యాపేట జిల్లాలోని చిలుకూరు మండల కేంద్రంలో పిడుగు పడి రెండు గేదెలు మృతి చెందాయి. 

20 మేకలు మృత్యువాత

సంగారెడ్డి: నిజాంపేట మండలం నగధర్ గ్రామంలో పిడుగుపాటుకు 20 మేకలు మృత్యువాతపడ్డాయి. గ్రామానికి చెందిన దుద్యాల మాణిక్యం మేకలను మేపడానికి అడవిలోకి తోలుకెళ్లాడు. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవ డంతో చెట్టు కిందకు వెళ్లాడు. ఈ క్రమంలోనే  పిడుగుపడి 20 మేకలు మృతిచెం దాయి. అదేవిధంగా సిర్గాపూర్ మండలంలోని అంతర్గాంలో ఎద్దు పిడుగుపాటుకు మృతిచెందింది.