- అత్యధికంగా కూకట్‌పల్లిలో 3.08 సెం.మీ వర్షపాతం
- అత్యల్పంగా మారేడుపల్లిలో 1.08 సెం.మీ
- ముంపు ప్రాంతాల్లో నిలిచిన వరద
- ఇబ్బందులు ఎదుర్కొన్న వాహనదారులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 18 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన వర్షం గంట పాటు దంచికొట్టింది. వర్షానికి పలుచోట్ల రోడ్లపై వరద నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో పనులు ముగించుకుని ఇండ్లకు వెళ్లే వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సికింద్రాబాద్, మలక్‌పేట్, జూబ్లీహి ల్స్, బంజారాహిల్స్, ఉప్పల్, బోడుప్పల్, రామాంతపూర్, తార్నాక, హబ్సీగూడ, బాలనగర్, మేడిపల్లి, పీర్జాదిగూడ, యూసుఫ్ గూడ, దిల్‌సుఖ్ నగర్, చింతల్, హైటెక్ సిటీ, మియాపూర్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఫిల్మ్‌నగర్, లింగంపల్లి ప్రాంతాల్లో వర్షం తీవ్రతగా ఎక్కువగా కనిపించింది.
కూకట్‌పల్లిలో అత్యధికంగా 4.5సెం.మీ వర్షపాతం నమోదైంది. కుత్బుల్లాపూర్‌లో 3.08 సెం.మీ, పటాన్‌చెరులో 2.8 సెం.మీ, శేరిలింగంపల్లిలో 2.5 సెం.మీ నమోదైంది. మారే డుపల్లిలో అత్యల్ఫంగా 1.8 సెం.మీ వర్షం కురిసింది. వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమ త్తంగా ఉండాలని కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను పంపించాలని సూచించారు. ప్రజలు అత్యవస రమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్ నంబర్ 040 లేదా డీఆర్‌ఎఫ్ సహాయం కోసం 90001 13667 నంబర్లలో సంప్రదించాలన్నారు.