calender_icon.png 28 October, 2024 | 3:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు

07-07-2024 08:24:36 PM

హైదరాబాద్: తెలంగాణలో రుతుపనాలు తీవ్రతరం కావడంతో రాష్ట్రంలో పలు చోట్ల ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండంటంతో భారత వాతావరణ శాఖ (ఐఎండి) నగరానకి కూడా ఎల్లో అలర్ట్  ప్రకటించింది. ఐఎండి సూచనల ప్రకారం అన్ని మండలాల్లో  తేలిక పాటి నుంచి ఒ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతో పాటు ఈదురుగాలలు కూడా వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రానున్న మూడు రోజుల పాటు గరిష్టి ఉష్ణోగ్రతలుఉ 29 నుంచి 31డిగ్రీలు సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. 

సోమవారం  ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం ,నల్గొండ, సూర్యాపేట, మహాబూబాబాద్, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చెల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహాబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి,మెదక్,కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.