కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మండుటెండ తో పాటు విపరీతమైన ఉక్కపోతతో ఉన్న వాతావరణం ఆకస్మికంగా మారిపోయింది. ఈదురుగాలి, ఉరుములు, మెరుపులతో గంటకు పైగా కుండపోతగా వర్షం కురిసింది. అటు ఇల్లందు కానీ కొత్తగూడెం వైపుగాని వర్షం లేకపోవడం విశేషం. ఈ వర్షంతో పత్తిపంటకు కొంత నష్టం జరిగే అవకాశం ఉండగా ఇతర పంటలకు మంచిగా ఉపయోగపడనుంది. నవరాత్రి ఉత్సవాలకు, బతుకమ్మ సంబరాలకు వర్షంతో ఆటంకం ఏర్పడింది.