సూర్యాపేట(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లాలో వాన దంచికొట్టింది. చెరువులు, కుంటలు అలుగుపారాయి. హుజుర్‌నగర్ నియోజకవర్గంలో ముకుందాపురంలో అత్యధికంగా 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. కోదాడ, హుజుర్‌నగర్ పట్టణాలు నీటిలో మునిగాయి. వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది. కోదాడ పట్టణ రోడ్లపై నీరు వరుదలా పారియి. కోదాడ మున్సిపల్ కార్యాలయంలోకి నీరు చేరడంతో రికార్డులు తడిచిపోయాయి. హుజుర్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో ఇండ్లు నీట మునిగాయి. తుంగతూర్తి నియోజకవర్గంలో గత రెండు రోజులుగా కురిచిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లాయి. సూర్యాపేటలో మానసానగర్ నీట మునిగింది.