రంగారెడ్డి: జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు. చేవెళ్ల లో ఈసీ, మూసి వాగు ఉదృతంగా ప్రహిస్తున్నాయి. భారీ వర్షలు కురవడంతో పలు నియజకవర్గాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. షాద్ నగర్ నియజకవర్గం లో జడ్పీహెచ్ఎస్ పాఠశాల వర్షంతో నిండిపోయింది.
వెలిజర్లలో భారీగా కురిసిన వర్షం
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఫరూఖ్ నగర్ మండలం వెలి జర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో భారీగా నీరు చేరింది. ఆ ప్రాంతం మొత్తం చెరువును తలపించేలా మారింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పురాతన ఇళ్లు లో కుడా భారీగా నీరు చేరింది. స్థానిక ప్రజాప్రతితులు ప్రత్యేక చొరవ తీసుకొని నిండుకున్న వాటర్ ను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.