calender_icon.png 27 December, 2024 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో పలుచోట్ల భారీ వర్షం

02-11-2024 02:01:37 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 1(విజయక్రాంతి): నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్నప్పటికీ మూడు గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. లింగంపల్లి, మియాపూర్, కొండాపూర్, కేపీహెచ్‌బీ, మూసాపేట, నిజాంపేట, మేడ్చల్, మాదాపూర్, సికింద్రాబాద్, బేగంపేట, బోయిన్‌పల్లి, మల్కాజిగిరి, కండ్లకోయ, కృష్ణాపూర్, దుండిగల్, గండిమైసమ్మ, మల్లంపేట్, చార్మినార్, మలక్‌పేట్, మెహదీపట్నం, ఓయూ, మణికొండ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఆయా ప్రాంతాల్లోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో స్వల్పంగా వర్షం కురిసింది.