calender_icon.png 5 October, 2024 | 2:58 PM

నగరంలో పలుచోట్ల భారీ వర్షం

05-10-2024 12:00:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 4 (విజయక్రాంతి): గ్రేటర్‌లో శుక్రవారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోత ఉండగా వాతావరణ మార్పులతో సాయంత్రం, రాత్రి వర్షం కురిసింది. నాంపల్లి, టోలీచౌకి, మెహదీపట్నం, చాంద్రాయణగుట్ట, కార్వాన్, హయత్‌నగర్, తార్నాక, హబ్సీగూడ, ఎల్‌బీనగర్, చైతన్యపురి, ఖైరతాబాద్, సోమాజిగూడ, బంజా రాహిల్స్, హైటెక్‌సిటీ, మాదాపూర్, కూకట్‌పల్లి, లింగంపల్లి, నార్సింగి, మణికొండ, గండిపేట్, కోకాపేట్,  బేగంపేటతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

ఉప్పల్‌లో కుండపోత వాన పడింది. వర్షపు నీరు రోడ్లపై నిలవడంతో పలుచోట్ల ట్రాఫిక్‌జాం అయింది. మెహదీపట్నంలో  50.5 మిల్లీ మీటర్లు, చాంద్రాయణగుట్టలో 48.3 మి.మీ, కార్వాన్‌లో 35.3 మి.మీ,  హయత్‌నగర్‌లో 16.5 మి.మీ వర్షపాతం నమోదయింది.