హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 5 (విజయక్రాంతి): నగరంలో పలు చోట్ల శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. చాంద్రాయణగుట్టలో 30.3 మి.మీ, కంచన్‌బాగ్‌లో 28మి.మీ., ఫలక్‌నుమాలో 27.8మి.మీ., సంతోష్‌నగర్‌లో 27.5మి.మీ, సరూర్‌నగర్‌లో 27.3మి.మీ, ఎల్‌బీనగర్‌లో 26.5మి.మీ., హఫీజ్‌పేట్‌లో 26.5మి.మీ, చార్మినార్ పూల్‌బాగ్‌లో 25.5మి.మీ, చందానగర్‌లో 25.3మి.మీ, శేరిలింగంపల్లిలో 25మి.మీ., జూబ్లీహిల్స్‌లో 24.8మి.మీ., లింగోజిగూడలో 23.5మి.మీ., రాజేంద్రనగర్‌లో 23.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. శని, ఆదివారం కూడా పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు.