13-04-2025 10:23:59 PM
కల్లూరు,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 7.30 గంటల వరకు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. అకాల వర్షానికి కల్లాలోని వరి, మిరప రైతుల ఆందోళన గురయ్యారు. కోసిన ధాన్యం కల్లాలో అరబోసిన ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు రైతులు వడ్ల కల్లాలకు పరుగులు తీశారు. కస్టపడి పండించిన పంట చేతికి వచ్చి అమ్ముకునే సమయానికి అకాల వర్షాలు తోడై రైతులు ఆశల్లో నీళ్ళు చల్లినట్లు ఉందని రైతులు బాధని వ్యక్తం చేస్తున్నారు.