26-04-2025 08:53:23 PM
గడ్డపోతారంలో ఒరిగిన విద్యుత్ స్తంభం
లీఫార్మా పరిశ్రమ నుంచి వ్యాపించిన ఫీమ్స్
పటాన్ చెరు: జిన్నారం మండలంలో శనివారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. గడ్డపోతారం పంచాయతీలో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, గాలి దుమారంతో కురిసిన వర్షానికి గడ్డపోతారంలో విద్యుత్ స్తంభం ఒరిగింది. పారిశ్రామిక వాడలోని లీఫార్మా పరిశ్రమ నుంచి ఫీమ్స్ భారీగా వ్యాపించాయి. దీంతో స్థానికంగా ఉన్న నివాసం ఉంటున్న కార్మికులు, ప్రజలు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులుపడ్డారు. మరో వైపు వర్షాన్నిఆసరాగా చేసుకొని పలు పరిశ్రమలు రసాయన వ్యర్థాలను వదలడంతో వర్షం వరదలో కలిసిన రసాయనాలు సమీపంలోని చెరువు, కుంటల్లోకి చేరాయి. పీసీబీ అధికారులు సమస్యను పట్టించుకొని పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరారు.