calender_icon.png 27 October, 2024 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీ వర్షాలకు అతలాకుతలం.. జలదిగ్బంధంలో పలు గ్రామాలు

01-09-2024 03:25:57 PM

ఇళ్లల్లోకి చేరిన నీరు,బయట పోయటానికి ప్రజల కష్టాలు

పలు గ్రామాల్లో నిలిచి విద్యుత్ సరఫరా

జగిత్యాల, (విజయక్రాంతి): భారీ వర్షాలకు జగిత్యాల జిల్లా అంతా అతలాకుతలా మౌతుంది. పలు గ్రామాలు నీటిదిగ్బంధం అయ్యాయి. ఇళ్లల్లోకి నీరు చేరి ప్రజల కష్టాలు పడుతున్నారు. బయట పోయటానికి ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పలు గ్రామాల్లో నిలిచి విద్యుత్ సరఫరా నిలిచిపోయి చీకటి మాయం అయ్యాయి. పూర్తి వివరాల్లోకి జగిత్యాల జిల్లా కోరుట్ల, కథలాపూర్, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి మండలాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్, ఫకీర్ కొండాపూర్ గ్రామాల మధ్య హై లెవెల్ వంతెన నిర్మాణంలో నున్న క్రమంలో పక్కనేలో లేవని వంతెన నిర్మించారు. భారీ వర్షాల కారణంగా లో లెవెల్ వంతెన తెగిపోవడంతో 6 గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోయాయి. దీంతోపాటు కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామంలోని లో లెవెల్ వంతెన పై నీరు పారడంతో రాయికల్ మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి. మేడిపల్లి మండలంలోని కమ్మర్ పేట వెంకట్రావుపేట, రత్నాలపల్లి, గ్రామాల మధ్య ఉన్న లో లెవెల్ వంతెనలపై భారీగా నీరు పార డంతో సుమారు 16గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.

పలు గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతోపాటు ఇళ్లల్లోకి నీరు చేయడంతో నీటిని బయట పారపోసెందుకు ప్రజలు అష్ట కష్టాలు పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కథలాపూర్ మండలం గంభీర్ పూర్, తాండ్రియాల గ్రామాల్లో భారీ వర్షం కారణంగా ఇళ్లల్లోకి నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అర్ధరాత్రి నుండి కురుస్తున్న ఎడతెరిపి వర్షాల కారణంగా జగిత్యాల జిల్లాలోని పలు మండలాలు, గ్రామాలకు రాకపోకలు నిలిచి పోగా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.