19-04-2025 12:22:10 AM
జలమయమైన రోడ్లు
ఇబ్బందులు పడ్డ వాహనదారులు, ప్రజలు
ముషీరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వాన దంచి కొట్టింది. వర్షం నీరు రోడ్లపై ఏరులై పారడంతో పాదాచారులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ముషీరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలైన పార్శిగుట్ట, బాపూజీనగర్, వినోభానగర్, సాగర్‌లాల్ ఆసుపత్రి వీధి, భోలక్‌పూర్‌లోని అంబేద్కర్‌నగర్, అడిక్‌మెట్ డివిజన్లోని పద్మ కాలనీ, కవాడిగూడ డివిజన్లోని ఇందిరాపార్క్, గాంధీనగర్ డివిజన్లోని అశోక్ నగర్, సబర్మతి నగర్ తదితర ప్రాంతాలలో వర్షంనీరు నిలిచిపోవడం వల్ల ప్రజలు ఇబ్బందిపడ్డారు.
బాగ్ లింగంపల్లి, సుం దరయ్య విజ్ఞాన కేంద్రం సమీపంలో, దాయార మర్కెట్ నుంచి సాగర్‌లాల్ ఆసుపత్రి వరకు ఇటీవల మంచినీటి పైప్‌లైన్ పనులు పూర్తి చేసి రోడ్డు వేయకపోవడంతో పైప్‌లైన్ నిర్మాణం కోసం తవ్విన చోట రోడ్డంతా బురదమయంగా మారింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. మార్గంలోని పలు కాలనీలు, బస్తీలలో వడగళ్లు పడ్డాయని స్థానిక ప్రజలు తెలిపారు.