calender_icon.png 2 November, 2024 | 12:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్‌లో భారీ వర్షం.. జీహెచ్ఎంసీ హెచ్చరిక

12-05-2024 04:44:50 PM

హైదరాబాద్: నగర ప్రజలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చల్లని వార్త చెప్పింది. జీహెచ్ఎంసి పరిధిలో భారీ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంపి హెచ్చరించింది. ఏమైనా సమస్యలు ఉంటే 040 21111111, 9000113667 నంబర్లకు సంప్రదించాలని సూచించింది. తెలంగాణ రాష్ట్రంలో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ తెలంగాణవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడి వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్,ఖమ్మం, నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అలర్ట్ చేసింది. అటు ఆదివారం పలు జిల్లాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. సంగారెడ్డి, మెదక్, ఆసిఫాబాద్ జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. సంగారెడ్డిలో ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురుస్తోంది. నాగలి మండలం ముక్తాపూర్ లో 5.0 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.