calender_icon.png 6 October, 2024 | 6:01 PM

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

06-10-2024 03:51:34 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో గత వారం రోజులగా వర్షం పడుతుంది. మధ్య మధ్యలో ఎండలు కొడతున్నాయి. హైదరాబాద్ లో ఆదివారం ఉదయం నుంచి ఉక్కపోతగా ఉన్న మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం కురవడంతో ఉపశమనం లభించింది. వర్షం కురవడంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

నగరంలోని చైతన్యపురి, సైదాబాద్, చంపాపేట్, మలక్ పేట్, నాంపల్లి, కోఠి, అబిడ్స్, బషీర్ బాగ్, హిమాయత్ నగర్, బంజారాహిల్స్, అమీర్ పేట్, సనత్ నగర్, మియాపూర్, చందానగర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, జూబ్లీహిల్స్, బోరబండ, మధురానగర్, పంజాగట్ట, ఖైరతాబాద్, జగద్గిరిగుట్ట, షాపూర్ నగర్, జీడిమెట్ల, బహదూర్ పల్లి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, హైదర్ నగర్, అల్విన్ కాలనీ, నిజాంపేట్ లో వర్షం కురిసింది.