calender_icon.png 14 October, 2024 | 4:43 PM

ఏపీలో వర్షాలు

14-10-2024 02:06:41 PM

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా కొన్ని జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఆదివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావద్దని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. అక్టోబరు 14 నుంచి అక్టోబర్ 17 వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. అలర్ట్ అయిన విద్యాశాఖ ఈ నాలుగు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది.

అటు ఏపీకి 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య,  చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ సర్కార్ పలు జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేసింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.