calender_icon.png 30 November, 2024 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెన్నైకి భారీ వర్ష సూచన

30-11-2024 03:28:39 AM

నేడు మధ్యాహ్నం ఫెంగల్ తుఫాను తీరం దాటే చాన్స్

చెన్నై, నవంబర్ 29: బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫెంగల్ తుఫాను కరైకాల్ మధ్య శనివారం మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉంది. ఈ విషయాన్ని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శుక్రవారం ప్రకటించింది. తీరం దాటే సమయ ంలో గంటకు 90 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. ఈ క్రమంలోనే నార్త్ తమిళనాడు, పుదుచ్చేరీతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ తీరప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది.

ఫెంగల్ తుఫాను కారణంగా శుక్రవారం తమిళనాడులోని నాగపట్నం, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువణ్ణామలైలో ఈ నెల 30న అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ క్రమంలో తుఫానును ఎదుర్కోవడానికి తమిళనాడు ప్రభుత్వం సిద్ధమైంది. తుఫాను కారణంగా చెన్నై, చెంగల్పట్టు జిల్లాల్లోని పాఠశాలలు శుక్రవారం మూతపడ్డా యి. ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే వరకూ మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.