calender_icon.png 20 April, 2025 | 1:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుబాయిలో మళ్లీ భారీ వర్షం

03-05-2024 12:36:37 AM

పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు

న్యూఢిల్లీ, మే 2: ఎప్పుడూ ఎండలతో మండిపోతూ ఉండే యూఏఈలో ఇప్పుడు వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గత నెల 14, 15వ తేదీల్లో కుంభవృష్టితో ఏడారి ఈ దేశం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఏడాది మొత్తంలో కురిసే వర్షపాతం కేవలం ఆ రెండు రోజుల్లోనే కురవడం గమనార్హం. తాజాగా బుధ వారం రాత్రి ఉరుములు మెరుపులు, ఈదు రు గాలులతో కూడిన భారీ వర్షాలు మొదలయ్యాయి. దీంతో దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లే ‘ఎమిరైట్స్’ విమాన సర్వీసులు రద్దయ్యాయి. అలాగే దుబాయ్‌కి వెళ్లే లేదా వచ్చే ఇతర దేశాల సర్వీసులు సైతం రీ షెడ్యూలు చేసుకునే పరిస్థితి నెలకొన్నది. ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా అక్కడి విప్తత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తమైంది. ప్రైవేటు సంస్థల యాజమా న్యాలు గురు, శుక్రవారాల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని, అలాగే ప్రభుత్వ అధికారులు, సిబ్బంది వరద సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలిచ్చింది. ముంపు ప్రాంతాల్లోని ప్రధాన రహదారులను అక్కడి ప్రభుత్వం ఇప్పటికే బ్లాక్ చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చింది.