19-04-2025 01:27:21 AM
హైదరాబాద్‌లో ఈదురుగాలుల బీభత్సం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పొద్దంతా ఎండ, ఉక్కపోతగా ఉం డగా సాయంత్రం 5 గంటల సమయానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, కాలనీలు జలమయమయ్యాయి. నగరంలో 60 చెట్లు విరిగి విద్యుత్ స్తం భాలు, ట్రాన్స్‌ఫార్మర్లపై పడటంతో విద్యు త్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
కొన్ని చోట్ల చెట్లు విరిగి రోడ్ల మీద పడ్డా యి. చెట్లు విరిగిపడటంతోపాటు రోడ్లపై నీరు నిలవడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పలు చోట్ల సహాయక చ ర్యల్లో జాప్యం నెలకొనడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మణికొండ, నానక్‌రామ్‌గూడ, బండ్లగూడ, నార్సింగి, షేక్‌పేట, రాజేంద్రనగర్ ప్రాంతా ల్లో ఈదురుగాలులు, ఉరుములతో భారీ వ ర్షం కురిసింది.
కాగా మరో మూడురోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కూకట్‌పల్లి, హైకోర్టు సమీపంలోని మదీనా భవన్ వద్ద, కాచిగూడ డీమార్ట్ సమీపంలో, బషీర్‌బాగ్ పీజీ లాకాలేజీ ఎదుట రోడ్డుపై చె ట్లు విరిగిపడ్డాయి. ట్యాంక్‌బండ్ నుంచి లో యర్ ట్యాంక్‌బండ్‌కు వెళ్లే దారిలో రోడ్డుపై చెట్టు విరిగిపడటంతో తెలుగుతల్లి ఫ్లుఓవర్‌పై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
లంగర్‌హౌజ్ వద్ద బాపూ కాలనీలో ఓ చెట్టు విరిగి పడటంతో రెండు విద్యుత్‌స్తంభాలు నేలకొరిగాయి. నాంపల్లి రెడ్‌హిల్స్‌లో ఓ చెట్టు విరిగి ట్రాన్స్‌ఫార్మర్‌పై పడటంతో అది పేలిపోయింది. టీజీఎస్‌పీడీసీఎల్ సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు.
రోడ్లపై విరిగిపడ్డ చెట్లను 30 హైడ్రా డీఆర్‌ఎఫ్ టీంలు తొలగించాయి. వర్షం దృష్ట్యా హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్షించారు. జీహెచ్ ఎంసీ, జలమండలి, హైడ్రా అధికారులు సమన్వయంతో పని చేయాలనిఆదేశించా రు. వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద వెంట వెంటనే నీటిని తొలగించాలని ఆదేశించారు.
నేల కూలిన భారీ క్రేన్
భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ అబిడ్స్‌లో పెను ప్రమాదం తప్పింది. అబిడ్స్‌లోని రామకృష్ణ థియేటర్ ఎదురుగా ఉన్న భారీ క్రేన్ థియేటర్ ఎదుట నేల కూలింది. పలు వాహనాల మీద పడటంతో అవి ధ్వంసమయ్యాయి.
రంగారెడ్డి జిల్లాలో పంట నష్టం
రంగారెడ్డి(విజయక్రాంతి): రంగారెడ్డి జి ల్లాలో గాలివాన బీభత్సం సృ ష్టించింది. వరిధాన్యం తడిసిపోయింది. మా మిడికాయలు నేలరాలాయి. పలు ప్రాంతా ల్లో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. రోడ్లపైకి నీరు చేరడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
మూడు రోజులు వర్షాలు
రాబోయే మూడు రోజుల పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ.ల వేగం తో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల తో కూడిన వర్షాలు కురుస్తాయని వా తవారణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో వ ర్షాల ప్రభావం ఉండనుం ది. ఈ మేర కు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేశారు. కాగా రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలో 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు సైతం క్రమంగా పెరగనున్నాయి.
మెదక్ జిల్లాలో బీభత్సం
సంగారెడ్డి/సిద్దిపేట(విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట, మక్కరాజిపేట, పోతన్‌పల్లి, కసాన్‌పల్లి, పెద్దశివు నూర్ గ్రామాల్లో కళ్లాల్లో ధాన్యం తడిసి కొట్టుకుపోయింది. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం నర్సాపూర్‌లో పిడుగుపడి బసిరెడ్డి గాల్‌రెడ్డికి చెందిన ఎద్దు మృతి చెందింది.
సిద్దిపేటతోపాటు దుబ్బాక, గజ్వేల్, కొండపాక, కొమురవెల్లి, జగదేవ్‌పూర్, హుస్నాబాద్ ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురియడంతో పండ్ల తోటలు, కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొట్టుకుపోయింది. కామారెడ్డి మండలం ఇస్రోజి వాడిలో 40 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
జీహెచ్‌ఎంసీ పరిధిలో
నమోదైన వర్షాపాతం.. మిల్లీ మీటర్లలో
క్ర.సం మండలం ప్రాంతం మి.మీ.
1. బండ్లగూడ కాంచన్‌భాగ్ 80.5
2. బహదూర్‌పు రూప్‌లాల్ బజార్ 78.8
3. చార్మినార్ ఎస్‌ఆర్‌టీ కాలనీ 76.3
4. నాంపల్లి బేగంబజార్ 69.8
5. బండ్లగూడ మేకలమండి 69.5
6. చార్మినార్ డబీర్‌పురా 66.0
7. చార్మినార్ ఈదీ బజార్ 61.8
8. బండ్లగూడ ఫూల్‌బాగ్ 61.5
9. నాంపల్లి నాంపల్లి 61.3
10. బండ్లగూడ కందిగేట్ 58.0