లిథువేనియాలో ఘటన
న్యూఢిల్లీ, నవంబర్ 25: డీహెచ్‌ఎల్ సంస్థకు చెందిన బోయింగ్ 737 రవాణా విమానం సోమవారం లిథువేనియాలోని విల్నియస్ ఎయిర్‌పోర్టు సమీపంలో జనావాసాలపై కుప్పకూలింది. ల్యాండింగ్‌కు కొద్ది నిమిషాల ముందు ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలోని లిప్‌కల్నిస్ ప్రాంతంపై పడింది. లిథువేనియా కాలమానం ప్రకారం తెల్లవారు జామున 5.28కి ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదానికి గల కార ణాలు ఇంకా తెలియరాలేదు. ఈ విమా నం జర్మనీలోని లీప్‌జిగ్ నుంచి బయల్దేరింది. డీహెచ్‌ఎల్ కోసం స్విఫ్ట్ ఎయిర్ లైన్స్ అనే సంస్థ ఈ విమానాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుతానికి విమానాశ్రయం లోని మిగిలిన ఎయిర్ క్రాఫ్ట్‌లను కూడా నిలిపేశారు. మరోవైపు అక్కడి జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం మాత్రం ఈ విమానం కూలిన ఇళ్లల్లోని ప్రజలు సురక్షితంగానే ఉన్నారని వెల్లడించింది.