calender_icon.png 25 March, 2025 | 9:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెవీ లైసెన్స్ దందా.. ఆర్టీవో అడ్డా?

24-03-2025 12:00:00 AM

  • రవాణా శాఖ కార్యాలయంలో హెవీ లైసెన్స్ దందా?

ఇష్టారాజ్యంగా డ్రైవింగ్ స్కూల్ నిర్వహణ

ఫిట్నెస్ లేని వాహనాలు.. ప్రభుత్వ నిబంధనలకు తూట్లు?

శిక్షణ లేకుండానే సర్టిఫికెట్లు.. అధికారులకు ముడుపులు!

సంగారెడ్డి ఆర్టీవో కార్యాలయంలో అవినీతి బాగోతం

సంగారెడ్డి, మార్చి 23 ( విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలో డ్రైవింగ్ లైసెన్స్ జారీలో ఆర్టీఏ అధికారుల తీరు మారడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలు పక్కనబెట్టి ఇష్టారాజంగా వ్యవహరి స్తున్నారని విమర్శలు ఉన్నాయి. కొంతమంది వ్యక్తులకు ఎలాంటి అర్హత లేనప్పటికీ ముడుపులు తీసుకుని లైసెన్సులు జారీ చేస్తున్నట్టు తెలిసింది.

టు వీలర్ బైక్ నుంచి హెవీ వెహికల్స్ లైసెన్సులు ఇచ్చే విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్టు ప్రచా రం సాగుతుంది. ఆర్టీఏ కార్యాలయంలో హెవీ వెహికల్స్ లైసెన్సులు జారీ చేయడంలో ఏజెంట్లతో కుమ్ముకై వేలాది రూపాయలు తీసుకొని ఎలాంటి అర్హతలు లేని వారికి జారీ చేస్తున్నట్లు తెలిసింది.

సంగారెడ్డి జిల్లాలో కొందరు డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులు ఫిట్నెస్ లేని వాహనాలు నడిపిస్తూ కొత్తవారికి డ్రైవింగ్ లో శిక్షణ ఇస్తున్నారు. ఫిట్నెస్ లేని వాహనాలతో డ్రైవింగ్ శిక్షణ ఇస్తున్న రవాణాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోప ణలు వస్తున్నాయి.

ఇష్టారాజ్యంగా డ్రైవింగ్  స్కూల్స్ నిర్వహణ

సంగారెడ్డి జిల్లాలో ఇష్టారాజ్యంగా డ్రైవిం గ్ స్కూల్‌లో నిర్వహణ సాగుతుంది. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ జారీలో ఆర్టీఏ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. రవాణా శాఖ నిబంధనలు అతిక్రమించి డబ్బులు ఇచ్చిన వారికి హెవీ లైసెన్సులు జారీ చేస్తున్నారని సమాచారం. డ్రైవింగ్ స్కూల్ నిర్వహించే వారికి కనీస విద్యా అర్హతలు లేకపోయిన అధికారులు పట్టించుకోవడం లేదు.

డ్రైవింగ్ లో ఐదు సంవత్సరాల అనుభవంతో లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థ నుంచి మోటార్ డ్రైవింగ్ ట్రైనింగ్ ఇన్స్ స్టిట్యూట్ శిక్షణ పూర్తి చేసి ఉండాలి. డ్రైవింగ్ స్కూల్ నిర్వహించే వారికి విశాలమైన కార్యాలయంతో పాటు, క్లాస్ రూమ్, ట్రైనింగ్ కోసం సౌకర్యాలు కలిగి ఉండాలి. డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులు రవాణా శాఖలో నమోదు చేసుకోవాలి.

శిక్షణ కోసం వచ్చేవారికి భద్ర త కల్పించేందుకు వాహనంకు బీమా పాలసీ చేసి ఉండాలి. హెవీ డ్రైవిం గ్ లైసెన్స్ కావలసిన వ్యక్తి మొదట రవాణా శాఖ కార్యాలయం నుంచి లెర్నింగ్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.  ఆన్ లైన్ లో స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత వచ్చిన తేదీ ఆధారంగా ఆ రోజున ఆర్టీఏ కార్యాలయానికి వెళితే లెర్నిం గ్ లైసెన్స్ జారీ చేస్తారు.

ఆ తర్వాత రవాణా శాఖ అనుమతి పొందిన హెవీ డ్రైవింగ్ స్కూల్లో సుమారు 30 రోజులపాటు శిక్షణ పొందవలసి ఉంటుంది. డ్రైవింగ్ శిక్షణలో భారీ వాహనాలు నడిపేందుకు శిక్షణ ఇస్తారు. ఆర్టీఏ ఏజెంట్ ప్రైవేట్ డ్రైవింగ్ స్కూల్ వ్యక్తులతో ఒప్పందం చేసుకుని ఎలాంటి శిక్షణ లేకుండానే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ లు జారీ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కోసం భారీగాని డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

సంగారెడ్డి జిల్లాలో ప్రధానంగా సంగారెడ్డి, పటాన్ చెరు, జహీరాబాద్ సదాశివపేట ఆందోల్ నారాయణ ఖేడ్‌తో పలు ప్రాంతాలలో డ్రై వింగ్ శిక్షణ కార్యాలయాలను ప్రైవేటు వ్యక్తు లు ఏర్పా టు చేశారు. డ్రైవింగ్ శిక్షణ ఇచ్చేందుకు మంచి కండిషన్ లో ఉన్న వాహనాలు ఉండాలి. భారీ వాహనాలు ఏ ఒక్క డ్రైవింగ్ శిక్షణ కేంద్రంలో కనిపించడం లేదు. ప్రైవేటు డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలలో భారీ వాహనాలు లేకపోయినా నిర్వాహకులకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ లు జారీ చేస్తున్నట్లు తెలిసింది. 

హెవీ డ్రైవింగ్ శిక్షణ లేకుండానే లైసెన్సులు జారీ?

రవాణా శాఖ నిబంధనల ప్రకారం లెర్నింగ్ లైసెన్స్ పొందిన వ్యక్తి 30 రోజులపాటు హెవీ డ్రైవింగ్ శిక్షణ పొందవలసి ఉం టుంది. డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులు శిక్షణ పొందినట్లు సర్టిఫికెట్ జారీ చేస్తే ఆర్టీఏ అధికారులు పరిశీలించి భారీ వాహనాలు నడి పేందుకు సమర్ధుడని హెవీ డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు. కానీ సంగారెడ్డి జిల్లాలో రవాణా శాఖ నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా హెవీ లైసెన్స్ జారీ చేస్తున్నారు ప్రచారం జరుగుతుంది.

ఒక్కో లైసెన్స్ కూ ఆర్టీఏ ఏజెంట్లు రూ. పదివేల వరకు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కు ఎలాంటి పరీక్షలు లేకుండానే లైసెన్స్ జారీ చేస్తున్నారని తెలిసింది. కొంత మంది డ్రైవింగ్ రాకపోయినా లైసెన్స్ తీసుకొని రోడ్డు ప్రమాదాలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

కొంత మంది వ్యక్తులు నేరుగా వెళితే, లైసెన్స్ జారీ చేసేందుకు నిబంధనలు పేరుకు భారీ వాహనం నడప రాదని తిరస్కరిస్తున్నట్టు తెలిసింది. అదే రవాణా శాఖ ఏజెంట్ ద్వారా వెళితే ఆ వ్యక్తికి క్షణాలలో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న రవాణా శాఖ కార్యాలయాలు అవినీతి అక్రమలపై విచారణ చేసి తగు చర్య తీసుకోవాల ని ప్రజల డిమాండ్ చేస్తున్నారు.