calender_icon.png 31 October, 2024 | 4:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీగా బంగారం పట్టివేత

08-07-2024 12:20:44 AM

రూ. 3 కోట్ల విలువైన 4 కిలోల బంగారం స్వాధీనం

అదుపులో ఇద్దరు నిందితులు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 7 (విజయక్రాంతి) : అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ముఠాను డీఆర్‌ఐ( డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు పట్టుకున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలపై దృష్టి సారించిన అధికారులు, కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు బస్సులో బంగారం తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఇద్దరు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి దాదాపు రూ.3 కోట్ల విలువైన 4 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.