నల్లగొండ, విజయక్రాంతి): భారీ వర్షాలకు నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోం ది. దీంతో ప్రాజెక్టు ఐదు గేట్లను 4 అడుగులకు మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. రిజర్వాయర్‌లోకి 6 వేల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో వస్తుంది.
వరద మరింత పెరిగే అవకాశం ఉండడంతో క్రస్టుగేట్ల ద్వారా 12,690 క్యూసెక్కులు విడుదల చేస్తూ రిజర్వాయర్‌ను కొంత మేర ఖాళీ చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీట్టి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.92 టీఎంసీలుగా ఉంది. ఎడమ కాల్వకు 142 క్యూసెక్కులు వదులుతున్నారు. వర్షం కారణంగా కుడి కాల్వకు నీటి విడుదల నిలిపేశారు.