calender_icon.png 12 January, 2025 | 3:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద కాలువకు గండి.. ఆందోళనలో గ్రామస్తులు

12-01-2025 11:08:43 AM

ఇళ్లలోకి నీరు చేరడంతో ఆందోళనలో గ్రామస్తులు

మానకొండూర్, విజయక్రాంతి: వరద కాలువకు గండిపడడంతో భారీగా వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని  మన్నెంపల్లి గ్రామంలో గల వరద కాలువ ద్వారా మానకొండూర్ మండలంలోని చందర్ల మీదుగా వివిధ రైతులకు అందించేందుకు నీటిని విడుదల చేశారు. చెత్త భారీగా పేరుకుపోవడంతో ఉధృతకు చెందిన వైపు వెళ్లకుండా మల్లంపల్లి వద్ద నిలిచిపోవడంతో గండిపడింది.

గత కొన్నేళ్లుగా వర్ధకాలు ద్వారా తమ ఇండ్లలోకి నీళ్లు వస్తున్నాయని పలు అధికారులకు మొరపెట్టుకున్నప్పటికీ తమకు ఎలాంటి న్యాయం జరగడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి గ్రామంలోకి నీళ్ళు చేరడం వల్ల తమ ఇండ్లలోకి నీరు వచ్చి ఇంటిలో బియ్యంతో పాటు వివిధ సామాగ్రి నీటిలో తడిచిపోయి చాలా ఇబ్బందులు నష్టం జరిగిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ సమస్యను పరిష్కరించి రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ముమ్మరంగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

పరిశీలించిన ఎమ్మెల్యే

మన్యం పెళ్లి గ్రామంలో వరద కాలువ ద్వారా ఇల్లల్లోకి నీరు వచ్చి చేరడంతో మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గ్రామాన్ని సందర్శించి పలు పిల్లలను పరిశీలించారు అనంతరం సంబంధిత వర్ధకాలువ అధికారులతో మాట్లాడి సమస్యను ఈత ప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు.