calender_icon.png 20 September, 2024 | 3:24 AM

గోదావరికి వరద ఉధృతి.. మూడో హెచ్చరిక జారీ చేసిన అధికారులు

27-07-2024 04:36:56 PM

భద్రాచలం : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం గంటగంటకు పెరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు గోదావరి వదర ప్రవాహం 53 అడుగులు దాటిన నీటిమట్టం కారణంగా అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భద్రాచలంలోని కొత్త కాలనీలోకి భారీగా మురుగునీరు చేరింది.

కొత్త కాలనీలోని దాదాపు 30 ఇళ్లను మురుగునీరు ముంచెత్తడంతో కొత్త కాలనీవాసులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. నీరు ఎత్తిపోసే మోటార్లు పాడవడంతో మురుగునీరు పేరుకుపోయింది. ఇదిలా ఉండగా భద్రాచలంలోని ఏఎంసీ కాలనీకి వరద నీరు చేరడంతో కాలనీలోని 40 ఇళ్లలోకి వచ్చింది. 200 మందిని పునరావాస కేంద్రానికి అధికారులు తరలిస్తున్నారు.