calender_icon.png 15 January, 2025 | 11:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాగర్‌కు భారీగా వరద ప్రవాహం

04-08-2024 01:26:46 AM

  1. 565 అడుగులకు చేరి, క్రస్టుగేట్లను తాకిన నీరు
  2. సోమవారం ఉదయం గేట్లేత్తే అవకాశం 
  3. శ్రీశైలం నుంచి 5 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో

హైదరాబాద్/నల్లగొండ/నాగర్‌కర్నూల్, ఆగస్టు 3 (విజయక్రాంతి): నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుంచి భారీగా ప్రవాహం వచ్చి చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి 4,24,466 క్యూసెక్యుల వరద వచ్చి చేరుతుండటంతో 202 టీఎంసీల నీటితో 882 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి గత వారం రోజులుగా 4 లక్షల క్యూసెక్కులకుపైగా ప్రవాహం చేరుతుండటంతో సాగర్ నీటిమట్టం స్వల్ప వ్యవ ధిలోనే గణనీయంగా పెరిగింది.

సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.50 50 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 565 అడుగులు (244.1480 టీఎంసీలు)గా ఉంది. దీం తో రిజర్వాయర్ క్రస్టుగేట్ల వరకు నీటిమట్టం చేరింది. ప్రవాహం ఇదే రీతిన కొనసాగితే ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయం క్రస్టుగేట్లు ఎత్తే అవకాశముంది.  శనివారం రాత్రి 9 గంటలకు శ్రీశైలం నుంచి సాగర్‌కు విద్యుత్ ఉత్పత్తితో పాటు 10 గేట్లు ఎత్తి 5,24,228 క్యూసెక్కుల వరదను వదిలారు. దీంతో కృష్ణమ్మ పాల పొంగులతో పర్యాటకులను ఆకట్టుకుంటున్నది. శ్రీరాంసాగర్ ఇంకా 42.81 టీఎంసీల  వద్దే ఉండిపోయింది. 

ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఇలా..

కృష్ణా బేసిన్.. (శనివారం సాయంత్రం 6 గంటల నాటికి)

ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుత నిల్వ ఇన్‌ఫ్లో అవుట్‌ఫ్లో

(టీఎంసీల్లో) (టీఎంసీల్లో) (క్యూసెక్కులో) (క్యూసెక్కుల్లో)

అల్మట్టి                    129.72             72.89 313000 275000

నారాయణపూర్ 37.64 28.88 260000 256271

ఉజ్జయిని 117.24 102.34 38605 307

జూరాల 9.66 8.45 290000 270452

తుంగభద్ర 105.79 98.26 138393 149202

శ్రీశైలం 215.81 202.04 433088 552641

నాగార్జునసాగర్ 312.05 244.15 303741 39741

పులిచింతల 45.77 3.69 24952 3305

ప్రాజెక్టులు- నీటి మట్టాలు (శనివారం సాయంత్రం 6 గంటల నాటికి)

గోదావరి బేసిన్.. (శనివారం సాయంత్రం 6 గంటల నాటికి)

సింగూరు 29.917 14.71 565 391

నిజాంసాగర్        17.800           3.87 0 0

శ్రీరాంసాగర్        90.300          42.81 17925 703

కడెం                  7.600            6.67 1518 957

ఎల్లంపల్లి            20.175           15.13 8355 13031

మేడిగడ్డ              16.170           93.70(మీ.) 451920 451920

సమ్మక్క సాగర్      6.940            80.30(మీ) 618720 618720

దుమ్ముగూడెం 36.570 52.30 (మీ) 552380 552380

భద్రాచలం          LEVEL             42.75 (మీ)    528953 528953