calender_icon.png 20 April, 2025 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అకాల వర్షాలతో అపార నష్టం

17-04-2025 12:49:56 AM

  1. జిల్లా వ్యాప్తంగా వరి మిర్చి నీళ్ల పాలు 
  2. ఆందోళనలో రైతులు 

ఖమ్మం, ఏప్రిల్ 16( విజయక్రాంతి ):- అసలే అరకొరగా వచ్చిన దిగుబడులకు ఒక వైపు గిట్టు బాటు ధర లభించక రైతులు అ ల్లాడిపోతుంటే మరో వైపు ప్రకృతి బీభ త్సo.. కన్నెర్రతో మరింతగా నష్టపోతున్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న దుస్థిది. జిల్లాలో కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతను కోలుకోకుండా చేస్తున్నాయి.పగలు ఎండ... రాత్రిళ్ళు గాలి వానతో రైతు నడ్డి విరుస్తున్నాయి.

ప్రభుత్వం అరకొరగా సరఫరా చేసిన టార్పాలిన్లు, గన్నీ సంచులు సరిపోకపోవడంతో వర్షానికి కల్లాల్లోని పంట తడిసి లబోదిబొమంటున్నారు. అకా ల వర్షాలు నోటి కాడ కూడును లగేసుకున్న చందంగా పంటను పనికి రాకుండా చేయడంతో రైతుల వెతలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి.

గత మూడు రోజులుగా ఖమ్మం జిల్లా కేంద్రంతో పాటు చుట్టు పక్కల ప్రాం తాలు, మధిర, కల్లూరు  పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, ఏన్కూరు తదితర మండలాల్లో వేలాది ఎకరాల్లోపండించిన ధాన్యం, మిర్చి తదితర పంటలు తో పాటు మామిడి తోట లు దెబ్బతిన్నాయి. కల్లాల్లోనే వేసవి ధాన్యం, మిర్చి తడిసిపోయి రైతులు కళ్ళనీళ్లపర్యంత మవుతున్నారు. తమ మొర ఆలకించే నాధు డు లేక లోలోపల మధన పడిపోతున్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సకాలంలో మిల్లులకు తరలించకపోవడంతో మరింత నష్టం వాటిల్లిం ది. జరిగిన నష్టం తర్వాత సంబంధిత సిబ్బం ది కంటితుడుపుగా క్షేత్ర స్థాయిలో సర్వే చేసి, చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వెల్లు వెత్తున్నాయి.మరో వైపు ఇంకా చాలా చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాల్సి ఉంది.

కాగా చేతికొచ్చే సమయంలో గాలి వాన బీభస్సానికి మామిడి నేల పాలవుతోంది. వేంసూరు, సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు మండలాల్లో మామిడి తోటలు దెబ్బతిని, లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. ఇదిలా ఉంటే ఇంకో వైపు మిర్చి రైతు ల కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఈ ఏడాది జిల్లాలో దాదాపు 54 వేల ఎకరాల్లో మిర్చి సాగైంది.

గతంతో పోలిస్తే ఈసారి ధర ఆధ:పాతాలం లో ఉంది. క్వింటా రూ.10 వేల నుంచి 12 వేల మధ్య ఉండడంతో మి ర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉన్న పంటనైనా అమ్ముకుందామంటే అకాల వర్షాలు అడ్డుకుంటూ అవస్థలపాలు చేస్తున్నాయని, ప్రభుత్వం స్పందించి క్షేత్ర స్థాయి లో సమగ్ర సర్వే చేసి, ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

కల్లూరులో అన్నదాతల అవస్థలు 

అకాల వర్షాలు కల్లూరు మండలంలో వరి, మామడి, మిరప రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.అకాల ఏప్రిల్ నెల మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు మూడు దపాలు గా అకాల వర్షాలు కురవడం జరిగింది. ఈ వర్షాల వలన రైతు అష్ట కష్టాలు కొని తెచ్చుకున్న వైనం గా ఉంది.

రైతులు పరిస్థితి చూస్తే ఆరు గాలా లు కస్టపడి పండించిన పంటలు చేతికి వచ్చి అ మ్ముకుని నాలుగు రూపాయలు కళ్ల చూసే సమయానికి ఈ అకాల వర్షాలు  వల్ల రైతులు గొంతుకు మింగుడు పడని పరిస్థితులు ఏర్పడ్డాయి.పుల్లయ్య బజర్, లింగాల చెన్నూరు, వెన్నవల్లి, పెద్దకోరుకోండి అన్నదాతలు విలవిలలాడుతున్నారు.నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులు పరిస్థితులు ఇంకా దారుణం గా తయారయ్యాయి.

పేరువంచ రెవిన్యూ లో బుధవారం వరకు 60 నుంచి 70 శాతం వరకు మాత్రమే కోతలయ్యా యి.ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రాగ మిగతా 30నుంచి 40 శాతం పంట ఇంకా పొలాల లోనే  కోత దశ లోనే ఉంది. ప్రస్తు తం కురిసిన వర్షలకు  వరి కొత మిషన్ దళారులదే రాజ్యం గా నడుస్తుంది. వారు ఎంత అంటే అంతకి ఇవ్వాలిసిందే.

టైర్ కోత మిషన్ తో 30నిముషాలు కోసే వరిపోలం ట్రాక్ మిషన్ ద్వారా 50నిముషాలు లేదా గంట టైం పడుతుంది ఈ విధంగా రైతులు వరి కోత మిషన్ లకి వేల కు వేలు పెట్టి కోత కోపించి కొనుగోలు యార్డ్ లకు తరీలిస్తే అక్కడ ఆలస్యమవుతోంది.అధికారులు స్పం దించి మిల్లర్ల ను అధికంగా మాట్లాడి, కాటా అమాలీలను ఎక్కువ సంఖ్యలో నియమించి, కొనుగోళ్లు ఉదృతం చేయాలని రైతులు కోరుతున్నారు.