హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో డ్రంక్ డ్రైవ్ కేసులు(Drunk drive cases) పెరిగాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,184 డ్రంక్ డ్రైవింగ్ కేసులు నమోదు కాగా, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 619 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు(Hyderabad Traffic Police) డిసెంబర్ 31, 2024, మంగళవారం రాత్రి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై విస్తృత తనిఖీలు నిర్వహించారు. నగరంలోని పలు చెక్‌పోస్టుల వద్ద పోలీసులను గమనించిన పలువురు మద్యం మత్తులో అధికారులను తప్పించుకునేందుకు ప్రయత్నించగా, మరికొందరు అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. కొత్త సంవత్సరాన్ని సందర్భంగా కొంతమంది యువకులు తమ వాహనాలతో విన్యాసాలు చేస్తూ ఆటంకాలు కలిగించారని పోలీసులు తెలిపారు.