calender_icon.png 23 January, 2025 | 11:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ మున్సిపాలిటీలో జోరుగా దరఖాస్తులు

23-01-2025 06:26:48 PM

నిర్మల్ (విజయక్రాంతి): ప్రజాపాలన ప్రభుత్వం అర్హులైన పేదలకు ఈనెల 26 నుంచి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో మున్సిపాలిటీలో భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. పట్టణంలోని 42 వార్డులో వార్డు అధికారులను ప్రభుత్వం నియమించగా ప్రజల నుంచి ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించడంతో పార్టీలకతీతంగా రాజకీయ నేతలు వారి అనుచరులచేత ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేయిస్తున్నారు. ఆయా వార్డుల నిర్వహిస్తున్న వార్డు సభలను మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ నాయకులు ఎడపల్లి నరేందర్ మేడారం ప్రదీప్ అపర్ణ నవీన్ తదితరులు ఉన్నారు.