calender_icon.png 26 November, 2024 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీగా కల్తీ నెయ్యి పట్టివేత

27-09-2024 02:34:33 AM

  1. క్రీం 7,280 కిలోలు, లూజ్ క్రీం 15,000 కిలోలు స్వాధీనం
  2. కాటేదాన్‌లో రాజేంద్రనగర్ ఎస్‌వోటీ బృందం దాడులు

రాజేంద్రనగర్, సెప్టెంబర్ 26: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రా మిక వాడలో తెలంగాణ ఫుడ్స్ కేంద్రంలో బుధవారం రాత్రి రాజేంద్రనగర్ ఎస్వోటీ బృందం దాడులు నిర్వహించి భారీగా కల్తీ నెయ్యి పట్టుకున్నది. గురువారం ఎస్వోటీ అధికారులు వివరాలు వెల్లడించారు. తెలంగాణ ఫుడ్ కేంద్రంలో కంపెనీలో కల్తీ పదా ర్థాలు తయారవుతున్నాయనే విశ్వసనీయ సమాచారంతో రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ, మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు దాడు లు నిర్వహించారు. క్రీం నెయ్యి 7,280 కిలోలు, లూజ్ క్రీం నెయ్యి 15,000 కిలోలు స్వాధీనం చేసుకున్నారు.

అదేవిధంగా బెల్లం 30 కిలోలు, కాస్టిక్ సొడా 100 కిలోలు, బేకింగ్ సొడా 50 కిలోలు, ఫుడ్ కలర్ బాటిల్ ఒకటి స్వాధీనం చేసుకున్నారు. దాడుల నేపథ్యంలో తయారీ కేంద్ర యజమాని పరారయ్యాడు. ఫుడ్ నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు తరలించినట్లు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ దైవనిధి తెలిపారు. కేంద్ర యజమాని ఎలాంటి అనుమతులు లేకుండానే ఆహార పదార్థాలు తయారు చేయిస్తున్నాడని తెలిసింది. త్వరలో ల్యాబ్ ఫలితాలు వస్తాయని, ఆ తర్వాత నిర్వాహకులపై తగిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు.