18-04-2025 08:42:53 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణ పి ఆర్ టి యు కో-ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో పదవి విరమణ చేసిన పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం శుక్రవారం రెడ్డి సేవా సంఘం ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. పదవీ విరమణ చేసిన గెజిటెడ్ హెడ్మాస్టర్ కొత్త జగన్ మోహన్ రెడ్డి, సోమిరెడ్డి, పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు బండారు నరేందర్, బిల్లి పెల్లి లక్ష్మయ్య, తుమికి వినోద్ రాజు, రుద్రపాటి రాజయ్య, కుర్ణ హరినాథ్, బానోత్ వాగ్య, కొప్పుల శంకర్, చిలక నాగయ్య, మార్గం శ్రీనివాస్, మార్కండేయలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు పొదిల వెంకట్రెడ్డి, నాగన బోయిన వెంకటేశ్వర్లు, కోశాధికారి వెలమల భాస్కర్ రావు, ప్రధానకార్యదర్శి బండారు హరికృష్ణ, పి ఆర్ టి యు మండల అధ్యక్షులు గోపాల శ్రీధర్, బీరం జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.