calender_icon.png 7 January, 2025 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భరోసా కాదు గుండెకోత

05-01-2025 02:12:00 AM

* నమ్మి ఓట్లేస్తే పచ్చి మోసమా?

* రైతన్నలను మరోసారి దగా చేసిన కాంగ్రెస్ 

* రైతుభరోసా రూ.6వేలకు కుదించడం అన్యాయం

* మోసానికి పర్యాయ పదం రేవంత్ రెడ్డి

* మాజీ మంత్రి హరీశ్ రావు మండిపాటు

హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాం తి): రైతన్నలను మరోసారి కాంగ్రెస్ ప్రభు త్వం దగా చేసిందని బీఆర్‌ఎస్ నేత,  మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. రైతుబంధు కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని పెంచుతామని, రైతు భరోసా కింద  ఏటా ఎకరానికి రూ. 15,000 ఇస్తామని ఆశలు పెట్టి  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. 

శనివారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సభల్లో రేవంత్ రెడ్డి “ఇప్పు డైతే రూ. పదివేలు, తమకు ఓటేస్తే రూ.15 వేలు..” అని ఊరించాడని, నమ్మించి ఓట్లు కొల్లగొట్టి గద్దెనెక్కారని మండిపడ్డారు.  గద్దెనెక్కిన తర్వాత గద్దల్లాగా మారి రైతులను దారుణంగా వంచిస్తున్నారని తెలిపారు.  రాష్ట్ర క్యాబినెట్  సమావేశం ద్వారా రైతుల ఆశలను అడియాసలు చేశారని, రైతు భరోసాను రైతు గుండె కోతగా మార్చారని ఆవే దన వ్యక్తం చేశారు.

  రైతు భరోసా కింద ఎకరానికి ప్రతి సీజన్‌కు  రూ.7,500 చొప్పున ఇస్తామని చెప్పి, రూ.6,000 కు కుదించారని విమర్శించారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి ఇది పరాకాష్ట అని,  మోసానికి పర్యాయపదం రేవంత్ రెడ్డి అనేది ఇప్పుడు నగ్నంగా బయటపడిందన్నారు. 

భూమి కలిగిన రైతులకే కాదు, కౌలు రైతులకు సైతం రెండు సీజన్లలో కలిపి రూ.15 వేలు పంట పెట్టుబడి సహాయం అందిస్తామని ప్రమా ణం చేశారని, కానీ క్యాబినెట్‌లో ఆ విషయ మే చర్చించలేదన్నారు.  వానా కాలంలో ఎగ్గొట్టిన రైతు భరోసాను కూడా యాసంగితో కలిపి ఎకరానికి రూ.15వేలు చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు.  తెలంగాణ రైతాంగం ఈ ద్రోహాన్ని క్షమించరని, నమ్మి ఓటేసిన పాపానికి పచ్చి మోసం చేసిన కాంగ్రెస్‌కు తగిన సమయంలో బుద్ధి చెబుతారని మండిపడ్డారు.